- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ.. ఇక ‘కరోనా ఆస్పత్రి’
<p>దిశ, న్యూస్ బ్యూరో: పేదలకు ఏ అనారోగ్యమొచ్చినా, సర్జరీ అవసరమైనా ముందుగా గుర్తుకొచ్చేది సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానా. పెద్దాసుపత్రిగా ప్రజల్లో ఇది గుర్తింపు పొందింది. కానీ, ఇకపైన అది ‘కరోనా’ ఆసుపత్రిగా మారనుంది. ఇంతకాలం అన్ని రోగాలతో బాధపడేవారికి సేవలందించిన ఈ ఆసుపత్రి ఇకపై కరోనా రోగులకు మాత్రమే పరిమితం కానుంది. ఆ ఆసుపత్రి మొత్తం కరోనా రోగుల కోసమే ప్రత్యేకం కానుంది. గాంధీ ఆసుపత్రిలోని వార్డులన్నింటినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం […]</p>
దిశ, న్యూస్ బ్యూరో: పేదలకు ఏ అనారోగ్యమొచ్చినా, సర్జరీ అవసరమైనా ముందుగా గుర్తుకొచ్చేది సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానా. పెద్దాసుపత్రిగా ప్రజల్లో ఇది గుర్తింపు పొందింది. కానీ, ఇకపైన అది ‘కరోనా’ ఆసుపత్రిగా మారనుంది. ఇంతకాలం అన్ని రోగాలతో బాధపడేవారికి సేవలందించిన ఈ ఆసుపత్రి ఇకపై కరోనా రోగులకు మాత్రమే పరిమితం కానుంది. ఆ ఆసుపత్రి మొత్తం కరోనా రోగుల కోసమే ప్రత్యేకం కానుంది. గాంధీ ఆసుపత్రిలోని వార్డులన్నింటినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోని వివిధవార్డుల్లో ఇన్‌పేషెంట్లుగా ఉంటూ చికిత్స పొందుతున్నవారు డిశ్చార్జి అయిన వెంటనే ఆ వార్డులన్నీ కరోనా పేషెంట్ల కోసం ఐసొలేషన్ వార్డులుగా మారిపోనున్నాయి. డిశ్చార్జి ప్రక్రియ పూర్తయిన తర్వాత కేవలం కరోనా రోగులు మాత్రమే ఈ ఆసుపత్రిలో ఉంటారు. ఈలోపు వివిధ అనారోగ్య అవసరాల కోసం వచ్చేవాందరినీ ఉస్మానియా ఆసుపత్రికి పంపించాలని మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో అది వ్యాప్తి చెందకుండా, ప్రజలకు అంటుకోకుండా ప్రభుత్వం సకల చర్యలూ తీసుకుంటోంది. అయినా దేశంలో, రాష్ట్రంలో వైరస్ అనుమానిత, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మూడేళ్ళ చిన్నారి కూడా దీని బారిన పడడంతో మంత్రి ఈటల ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం సైతం మూడు కొత్త పాజిటివ్ కేసులు రావడం, ఇందులో ఇద్దరు భార్యాభర్తలే కావడంతో ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ సోకిన వారికి ప్రత్యేకంగా చికిత్స చేయడంతోపాటు తగిన జాగ్రతలు వహించాల్సి ఉంటుందని, అందుకోసం గాంధీ ఆసుపత్రి మొత్తాన్ని కేవలం కరోనా కోసమే కేటాయించడం ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీనియర్ వైద్యులు, ఉన్నతాధికారులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. దీంతో గాంధీ ఆసుపత్రిలోని వార్డులన్నింటినీ వీలైనంత త్వరగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయం జరిగింది.
కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గాంధీ దవాఖానాను పూర్తిగా కరోనాకు మాత్రమే కేటాయించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. 1954లో నిర్మించిన గాంధీ ఆస్పత్రి 1,200 బెడ్లతో ఏడాదికి 42 వేలమందికి ఇన్ పేషంట్లుగా చికిత్స అందిస్తోంది. ఇక నుంచి ఆస్పత్రిలోని వార్డులన్నీ కరోనా పరీక్షలు, వైద్యం కోసం మాత్రమే పరిమితం కానుంది. మైనర్ ఆపరేషన్లు, ప్రమాద బాధిత కేసులన్నీ ఇకపై ఉస్మానియాకే చేరుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్యలో పెరుగుదల కనిపించే అవకాశం ఉందనే అంచనాతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఊహించని రీతిలో వైరస్ వ్యాప్తి చెందితే, కేసుల సంఖ్య పెరిగితే వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ దిశగా మంత్రి, అధికారులు ఆలోచించినట్లు తెలిసింది.
అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి బదులు అన్ని వైపుల నుంచీ సంసిద్ధంగా ఉండేందుకు వీలుగా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అందులో ఉన్న ఇన్‌పేషంట్లను రోజుల వ్యవధిలోనే డాక్టర్లు డిశ్చార్జి చేయనున్నట్లు సమాచారం. ఇకపై ఒక్క కొత్త కేసును కూడా చేర్చుకోరు. గాంధీతోపాటు కింగ్కోఠి ఆస్పత్రిని కూడా కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Tags : Gandhi Hospital, Corona, Specialization, wards, Shifting to Osmania






