గాంధీ భవన్‌లో కరోనా కలకలం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-15 04:24:29  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం గాంధీ భవన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలోని కొవిడ్-19 కంట్రోల్ రూములో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన నేతలు గాంధీ కార్యాలయాన్ని వారం రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది గాంధీభవన్‌కు చేరుకుని పరిసరాలను శానిటైజ్ చేయించారు.</p>

గాంధీ భవన్‌లో కరోనా కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం గాంధీ భవన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలోని కొవిడ్-19 కంట్రోల్ రూములో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన నేతలు గాంధీ కార్యాలయాన్ని వారం రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది గాంధీభవన్‌కు చేరుకుని పరిసరాలను శానిటైజ్ చేయించారు.

Next Story