- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
13 నుంచి గడ్డి అన్నారం మార్కెట్ బంద్
<p>దిశ, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం మార్కెట్ నిర్వాహణపై మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఈ.వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మార్కెట్ యార్డులో భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్లు, రైతుదారులు, ఖరీదు దారులు, వినియోగదారులు ప్రభుత్వం నిర్థేశించిన నియమాలను అమలు చేయకపోవడం విచారకరం అన్నారు. ప్రస్తుతం […]</p>

దిశ, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం మార్కెట్ నిర్వాహణపై మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఈ.వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మార్కెట్ యార్డులో భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్లు, రైతుదారులు, ఖరీదు దారులు, వినియోగదారులు ప్రభుత్వం నిర్థేశించిన నియమాలను అమలు చేయకపోవడం విచారకరం అన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో లాక్‌డౌన్ నిబంధనలు పాటించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 13 బుధవారం నుంచి గడ్డిఅన్నారం మార్కెట్ కార్యకలాపాలను బంద్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, మార్కెట్ ఎన్ని రోజులు బంద్ అవుతుందనే విషయాన్ని మాత్రం ఖరారు కాలేదన్నారు. ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమించినచో కోవిడ్ -19 డిసీస్ అపడమిక్ యాక్ట్ 1897, తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966 రూల్ 52 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






