మహా శివరాత్రికి వచ్చేస్తున్న ‘గాలి సంపత్’

51

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో శ్రీ విష్ణు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తండ్రీకొడుకులు‌గా నటిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తున్న ఈ చిత్రానికి తనే స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. కో డైరెక్టర్, రైటర్ ఎస్.‌కృష్ణ నిర్మిస్తున్న చిత్రానికి అనీష్ దర్శకులు కాగా, మహాశివరాత్రి కానుకగా మూవీని మార్చి 11న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో థియేటర్స్‌లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించేందుకు వస్తున్న సినిమా..హార్ట్‌ను టచ్ చేసే ఎమోషన్స్‌తో నిండిపోయి ఉంటుందని తెలిపారు మేకర్స్. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోందని..డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశామని తెలిపారు. త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి వరల్డ్ వైడ్‌గా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. లవ్ లీ సింగ్ హీరోయిన్‌గా వస్తున్న సినిమాలో తనికెళ్ల భరణి, రఘు బాబు ప్రధాన పాత్రల్లో కనిపించబోతుండగా..అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..