‘గాలి సంపత్’ కథే వేరు!

by  |
‘గాలి సంపత్’ కథే వేరు!
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకులు అనిల్ రావిపూడి కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. స్నేహితుడి (ఎస్. కృష్ణ) బ్రిలియంట్ స్క్రిప్ట్‌కు ఫిదా అయిన తను.. ‘గాలి సంపత్’ మూవీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని తెలిపారు. స్క్రీన్‌ప్లే, క్రియేటివ్ సపోర్ట్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నానని అన్నారు. షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో శ్రీవిష్ణు హీరో. అనీష్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపించబోతుండగా, సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, నారా రోహిత్, దిల్ రాజు, శిరీష్ హాజరయ్యారు. హీరోహీరోయిన్లు, రాజేంద్ర ప్రసాద్‌పై దిల్ రాజు క్లాప్ ఇవ్వగా.. నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు.

కాగా ‘గాలి సంపత్’ కాన్సెప్ట్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ బావిలో పడిపోయి సహాయం కోసం ఎదురుచూస్తుండగా.. పైనే ఉన్న శ్రీ విష్ణు తాడు పట్టుకుని హెల్ప్ చేయాలా వద్దా? అన్నట్లుగా చూస్తున్నాడు. కాగా వీరిద్దరూ సినిమాలో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌లో ఎలాంటి కామెడీ పండిస్తారో? డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రియేటివిటీ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Next Story

Most Viewed