స్వీటీ… సుమక్కకే పంచా?

by  |
స్వీటీ… సుమక్కకే పంచా?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఇన్ని రోజులు కాస్త సైలెంట్‌గా ఉంది. కానీ ఈ మధ్య అనుష్క ఇండస్ట్రీకొచ్చి 15ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం నుంచి మీడియాకు చాలా దగ్గరైపోయింది. నిశ్శబ్ధం సినిమా ప్రచారంలో బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఓ ఛానల్‌ నిర్వహించిన స్పెషల్ షోలో పాల్గొంది అనుష్క. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ కావడంతో పంచ్‌లు పేల్చేస్తుంది అనుకున్నారు అంతా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పంచ్ పలక్‌నామాకే పంచ్ అన్నట్లుగా .. ఈ షోలో సుమపై పంచ్‌ల మీద పంచ్‌లు వేసింది స్వీటీ. ఇంతకీ ఏం జరిగిందంటే… షోకి స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన అనుష్కకు ఓ ఫోటో చూపించింది సుమక్క. వీరెవరు అని అడగ్గానే… వెంటనే నా కొడుకు అని చెప్పేసింది స్వీటీ. ఏంటీ నీ కొడుకా అంటూ షాక్ అయిపోయింది సుమ. ఇంతకీ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? బాహుబలి ప్రభాస్. ఔనవును మీ ఇద్దరికి చాలా పోలికలున్నాయి కదా అంటే.. అవును మరి నా కొడుకు కదా పోలికలు అలాగే ఉంటాయ్ అంటూ మరో పంచ్ వేసింది. మరి అమరేంద్ర బాహుబలి ఏమవుతాడు అంటే ఆయన వల్లే కదా… ఈయన కొడుకు అయింది అంటూ స్మార్ట్ ఆన్సర్ ఇచ్చింది.

Tags:Anushka Shetty, Sweety, Suma, Sumakka, Prabhas



Next Story

Most Viewed