- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు లేని లోటు తీర్చిన కూతురు.. తల్లికి అంతిమ సంస్కారాలు
by Sridhar Babu |
<p>దిశ, మానకొండూరు: హిందూ సాంప్రదాయం ప్రకారం కొడుకే చితికి నిప్పు పెట్టాల్సి ఉంటుంది. కానీ కేషపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఓ పేదింటి ఆడబిడ్డ తన కన్న తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించి రుణం తీర్చుకున్న ఘటన ఆదివారం శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన నాంపల్లి చంద్రమ్మ అనే నిరుపేద కుటుంబానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఆదివారం మృతి చెందడంతో ఆమె చిన్న బిడ్డ నాంపల్లి వెంకటమ్మ అంతిమ […]</p>

X
దిశ, మానకొండూరు: హిందూ సాంప్రదాయం ప్రకారం కొడుకే చితికి నిప్పు పెట్టాల్సి ఉంటుంది. కానీ కేషపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఓ పేదింటి ఆడబిడ్డ తన కన్న తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించి రుణం తీర్చుకున్న ఘటన ఆదివారం శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన నాంపల్లి చంద్రమ్మ అనే నిరుపేద కుటుంబానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఆదివారం మృతి చెందడంతో ఆమె చిన్న బిడ్డ నాంపల్లి వెంకటమ్మ అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పంటించిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. కొడుకు లేని రుణాన్ని తీర్చుకున్న బిడ్డ వెంకటమ్మను చూసి గ్రామస్తులు అభినందించారు.
Next Story






