యూట్యూబ్ మహాత్యం: చెల్లిని గర్భవతిని చేసిన అన్న

by  |
యూట్యూబ్ మహాత్యం: చెల్లిని గర్భవతిని చేసిన అన్న
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో యువత టిక్ టాక్ మోజులో పడి పాడైపోతుంది. ఇప్పటీకే ఈ టిక్ టాక్ మోజులో ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకొంటున్నారు. అలాంటి ఘటనలు చూస్తూ కూడా మిగిలినవారు అప్రమత్తంగా ఉండకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా టిక్ టాక్ మోజులో పడి ఒక మైనర్ బాలిక ఓ యువకుడి చేతిలో మోసపోయిన ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది.

చిప్పాడ భార్గవ్… టిక్ టాక్ లో మంచి పేరు తెచ్చుకొని ‘ఫన్ బకెట్’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి బుల్లితెర నుండి మంచి అవకాశాలు అందాయి. దీంతో భార్గవ్ ఒక సెలబ్రెటీ హోదాలో కొనసాగుతున్నట్టు ఫీల్ అయ్యాడు. తనతో పాటు మరికొంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి కొత్తగా టిక్ టాక్ నేర్చుకుంటున్న అమ్మాయిలపై కన్ను వేశాడు. ఈ నేపథ్యంలోనే విశాఖ కు చెందిన ఒక బాలిక కి టిక్ టాక్ నేర్పిస్తానని నమ్మబలికాడు. కొంచెం ఫేమ్ ఉన్న భార్గవ్ తో కలిసి టిక్ టాక్ చేస్తే అందరికి తెలుస్తానని అనుకున్న బాలిక అతనితో కలిసి టిక్ టాక్ లు, ప్రాంక్ వీడియోలు చేయడం మొదలు పెట్టింది. చెల్లి .. చెల్లి అని పిలుస్తూనే ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు భార్గవ్. ఫలితంగా బాలిక గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్గవ్ ని దిశా చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.



Next Story