పెండింగ్ కలెక్షన్లకు ఇంకా 17రోజులే టైం..

by  |
పెండింగ్ కలెక్షన్లకు ఇంకా 17రోజులే టైం..
X

దిశ, ఆదిలాబాద్ : పన్నుల వసూళ్లకు గడువు సమీపిస్తున్నది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 17 రోజులే గడువు ఉండగా.. ఉమ్మడి జిల్లాలోని 12 మునిసిపాలిటీల్లో లక్ష్యం చేరుకోవడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపట్టడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. మొండి బకాయిదారులకు నోటీసులు అందజేస్తున్నారు. కట్టని పక్షంలో డిమాండ్ నోటీసు, స్పందించని పక్షంలో రెడ్ నోటీసులను జారీ చేసి ఆ తర్వాత కట్టని వారి ఆస్తులను జప్తు చేయడానికి వెనుకాడబోమని మైకుల ద్వారా ప్రచారాలు చేస్తున్నారు.

స్పెషల్ డ్రైవ్..

ఆర్థిక సమాచారం సంవత్సరం ఈనెల 31తో ముగుయనుంది. ఉమ్మడి జిల్లాలోని 12 మునిసిపాలిటీల్లో 100 శాతం పన్నులు వసూలు లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను రూపొందించు కున్నారు. మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ వాడవాడలా మొండి బకాయిదారులకు ముందుగా డిమాండ్ నోటీసు అందజేస్తున్నారు. ఆ తర్వాత స్పందించకపోతే రెండు నోటీసులను జారీ చేస్తున్నారు. బల్దియాలో వార్డుల సంఖ్యను బట్టి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. వారికి రోజువారీగా టార్గెట్ ఇచ్చి ఉదయం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటింటికి తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారు. అలాగే కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశారు.

బకాయిల వివరాలు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ 88.11 శాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. భైంసా మున్సిపాలిటీలో 75 శాతం పన్నులు వసూలు కాగా.. నిర్మల్ మున్సిపాలిటీలో 77.83శాతం వసూలయ్యాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 68 శాతం పన్నులు వసూలు కాగా.. మంచిర్యాల మున్సిపాలిటీ లో 70 శాతం పన్నులు వసూలు అయ్యాయి. ఇక కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు చెన్నూరులో 70 శాతం పైగా పన్నుల వసూలు చేశారు. లక్షెట్టిపేటలో 80 శాతానికి పైగా పన్నుల వసూలు కాగా.. నస్పూర్‌లో 80శాతం, క్యాతంపల్లిలో 70 శాతం,బెల్లంపల్లిలో 80శాతం, మందమర్రిలో 80 శాతం, సిర్పూర్ కాగజ్ నగర్‌లో 83శాతం వసూలు అయ్యాయి.

మున్సిపాలిటీ లక్ష్యం వసూలైనవి వసూలు కావాల్సినవి

ఆదిలాబాద్ 7.01 3.51 3.50
నిర్మల్ 4.72 3.51 1.21
ఖానాపూర్ 28.69లక్షలు 27.09లక్షలు 1.60 లక్షలు
మంచిర్యాల 8.76 కోట్లు 5.38కోట్లు 3.38 కోట్లు
చెన్నూర్ 31.61లక్షలు 22.91 లక్షలు 8.74 లక్షలు
లక్షేట్టిపేట్ 1.76 కోట్లు 1.75 కోట్లు 1లక్ష
నస్పూర్ 1.24 కోట్లు 98 లక్షలు 26లక్షలు
క్యాతంపల్లి 1.26 కోట్లు 78.54లక్షలు 49.46లక్షలు
బెల్లంపల్లి 1.98కోట్లు 1.01లక్షలు 97లక్షలు
మందమర్రి 1.68కోట్లు 98.50 69.50 లక్షలు
కాగజ్‌నగర్ 1.45 కోట్లు 1.01కోట్లు 44లక్షలు



Next Story