అర్ధరాత్రి భారీ శబ్దాలు.. పరుగులు తీసిన జనం

49

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో గత కొద్దిరోజులుగా రాత్రుళ్లు భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా శబ్దాలు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మొన్నటిమొన్న బోరబండలో వరుసగా శబ్దాలు వినిపించడంతో అక్కడి వాసులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు సమాచారం.

తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌లో అర్ధరాత్రి భారీ శబ్దాలు వినిపించాయి.సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహాడీ షరీఫ్ తదితర ప్రాంతాల్లో సౌండ్స్ వచ్చాయి. దీంతో జనం భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. గతంలోనూ ఇదేవిధంగా శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. కానీ, దాని వెనుక ఉన్న మర్మం ఇప్పటివరకు తెలియరాలేదు.