పండుగ విక్రయాల్లో దుమ్ము లేపిన ఈ-కామర్స్..

by  |
amazon
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగలు ఈ కామర్స్ రంగానికి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. 2021లో పండుగల కాలంలో 9.2బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయి. 2020లో కరోనా కారణంగా అమ్మకాలు మందగించాయి. కాని ఇటీవల వైరస్ ప్రభావం తగ్గడం, వ్యాక్సినేషన్ అనుకున్నంత స్థాయిలో పెరగడంతో ప్రజల్లో కరోన భయం తగ్గి.. మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అయితే అధికంగా ఆన్‌లైన్ షాపింగ్ పైనే ఇంట్రెస్ట్ చూపించారు. కన్సల్టింగ్ సంస్థ రెడ్ సిర్ నివేదిక ప్రకారం..

గడిచిన ఐదేళ్లలో ఇండియాలో ఆన్‌లైన్ పండుగ విక్రయాలు 23శాతం వృద్ధిని సాధించాయి. మార్కెట్ లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి. వీటిల్లో ప్రజలు ఎక్కువగా మెుబైల్స్ పై ఇంట్రెస్ట్ చూపారని, విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో మెుబైల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2020లో అక్టోబర్, నవంబర్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది ఈ కామర్స్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చా్యి. మరోవైపు గృహాలంకరణ, ఇతర ఎలక్ట్రానిక్‌ వంటి విభాగాలు ఈ సంవత్సరం మంచి వృద్ధిని సాధించాయి.

పండుగ అమ్మకాలలో ఫ్లిప్ కార్ట్ 62శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా నిలిచింది. అక్టోబర్ మెుదటి వారంలోనే రూ.32,000 కోట్ల అమ్మకాలు ఆన్ లైన్‌లో విక్రయించారు. స్నాప్‌డీల్ తన ‘తూఫానీ సేల్’ సీజన్ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమై అక్టోబర్ 31న ముగిసిందని తెలిపింది. విక్రయ రోజుల్లో దాని రోజువారీ ఆర్డర్ వాల్యూమ్‌లు గత ఏడాది కంటే రెట్టింపుగా ఉన్నాయని సంస్థ తెలిపింది. ఫ్యాషన్ కేటగిరీ వాల్యూమ్‌లలో 254 శాతం వృద్ధిని సాధించగా, ఇల్లు, వంటగది గతేడాది కంటే 101 శాతం వృద్ధి చెందాయి. ఈ సంవత్సరం ఇతర లాభపడిన వాటిలో అందం, క్రీడలు, ఫిట్‌నెస్ రంగాలు వరుసగా 93 శాతం అమ్మకాలు సాధించి 53 శాతం వాల్యూమ్ వృద్ధిని పొందాయి. మతపరమైన, ఆధ్యాత్మికత కేటగిరీకి చెందిన ఉత్పత్తులు గత సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే 33 శాతం పెరిగాయి.

స్నాప్‌డీల్ పండుగ సీజన్ పనితీరులో భారత్‌లో అనుకున్నదాని కంటే ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. టైర్ 3 నగరాల డిమాండ్ గతేడాది కంటే 91 శాతం పెరిగింది. ఆన్‌లైన్ వాణిజ్యాన్ని భారత్ వేగంగా స్వీకరించడం పండుగ సీజన్ ఆర్డర్‌లు ఎలా పేర్చబడిందో కూడా కనిపిస్తోంది. 58 శాతం ఆర్డర్‌లు టైర్ 3 నగరాల నుండి వచ్చాయి. అయితే టైర్ 2 మరియు టైర్ 1 ఆర్డర్ వాల్యూమ్‌లలో వరుసగా 15 శాతం నుంచి 27 శాతం ఉన్నాయి.

అమెజాన్ (amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టి్వల్, ఫ్లిప్ కార్ట్ (flipkart) ది బిగ్ బిలియన్ డేస్‌లో వీటి అమ్మకాల వాల్యుయేషన్ ఎక్కువగా ఉంది. amazon ప్రతి నిమిషం 10కి పైగా ఉత్పత్తులను విక్రయించింది. భారత్ 5Gకి సిద్ధమవుతున్నందున.. అమెజాన్‌లో కొనుగోలు చేసిన మిడ్-రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లలో 84 శాతానికి పైగా 5Gమెుబైల్ ఫోన్స్ కోసం మెుబైల్ ప్రియులు కొనుగోలు చేశారు. అమెజాన్‌లో మొదటిసారిగా ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశారు.


Next Story

Most Viewed