- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘరానా మోసగాడు.. 5 కోట్ల అప్పులు చేసి పరారైన వ్యాపారి..
<p>దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మిని సూపర్ మార్కెట్ యజమాని ఘరానా మోసం చేశాడు. మిని సూపర్ మార్కెట్ యజమాని పాత గంగాప్రసాద్ సుమారు 5 కోట్ల వరకు అప్పులు చేసి కామారెడ్డి నుంచి పారిపోయాడు. పారిపోయే ఒక రోజు ముందు మిని సూపర్ మార్కెట్ ఇతరులకు విక్రయించాడు. దీంతో దుకాణంకు సామాగ్రిని ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు సూపర్ మార్కెట్ వద్దకు రావడంతో గంగప్రసాద్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లారని ఆరా తీయగా సూపర్ మార్కెట్ అమ్మేసారని […]</p>

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మిని సూపర్ మార్కెట్ యజమాని ఘరానా మోసం చేశాడు. మిని సూపర్ మార్కెట్ యజమాని పాత గంగాప్రసాద్ సుమారు 5 కోట్ల వరకు అప్పులు చేసి కామారెడ్డి నుంచి పారిపోయాడు. పారిపోయే ఒక రోజు ముందు మిని సూపర్ మార్కెట్ ఇతరులకు విక్రయించాడు. దీంతో దుకాణంకు సామాగ్రిని ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు సూపర్ మార్కెట్ వద్దకు రావడంతో గంగప్రసాద్ కనిపించలేదు.
ఎక్కడికి వెళ్లారని ఆరా తీయగా సూపర్ మార్కెట్ అమ్మేసారని చెప్పడంతో సూపర్ మార్కెట్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. ఒక్కొక్కరి వద్ద సుమారు 10 నుంచి 20 లక్షల వరకు అప్పు ఉన్నాడని తెలిపారు. అంతే కాకుండా మిగిలిన వారికి సుమారు 2 కోట్ల వరకు అప్పు ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ వద్ద తీసుకున్న డబ్బులను ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
Next Story






