భగ్గుమంటున్న చమురు ధరలు

by Shamantha N |   (  Updated:2021-06-11 22:46:22  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు రోజు రోజు పెరుగుతూ వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. తాజాగా పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ పై 25 పైసల చొప్పునా పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి.  ఇక తెలుగురాష్ట్రాలలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది.  అలానే [&hellip;]</p>

petrol
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు రోజు రోజు పెరుగుతూ వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. తాజాగా పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ పై 25 పైసల చొప్పునా పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇక తెలుగురాష్ట్రాలలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది. అలానే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.11 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.49గా ఉంది. ఈ జూన్‌ నెలలో ఇప్పటివరకు ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 23 సార్లు చమురు ధరలు పెరిగాయి.

Next Story