బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు : ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

by  |
బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు : ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ
X

న్యూఢిల్లీ : దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఫుడ్ సేప్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) మార్గదర్శకాలను విడుదల చేసింది. 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని వెల్లడించింది. గుడ్లు, మాంసం బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది.

సరిగా ఉడకని గుడ్లను, చికెన్ వండేటప్పుడు తినకూడదని సూచించింది. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో పక్షులతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించాలని పేర్కొంది. మృత్యువాత పడిన పక్షులను చేతితో తాకకూడదని, ముడి మాంసాన్ని ఖాళీ ప్రదేశం ఉంచరాదాని, ప్రత్యక్షంగా తాకవద్దని సూచించింది. ముడి మాంసం ఉంచే సమీప ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలని కోరింది. ఫౌల్ట్రీ ఉత్పత్తులపై ఆధారపడిన వ్యాపారవేత్తలు, వినియోగదారులు భయపడవద్దని విజ్ఞప్తి చేసింది.


Next Story

Most Viewed