ముందు బోర్డు… లోన కార్డు…

by Vadlamudi Anukaran |   (  Updated:2021-03-09 03:36:49  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇదేనేమో మరి. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అసాంఘీక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తుండడంతో ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు కొందరు. బహిరంగంగా మద్యం సేవించినా, జూదం ఆడుతున్న వారిని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలకు పనిచెప్పారు సీపీ. దీంతో సామాన్యులు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. కానీ బడా బాబులు మాత్రం కాస్తా డిఫరెంట్ గా తమ వ్యసనాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్థిక బలం, అంగబలం ఉంటే చాలు తామేం [&hellip;]</p>

ముందు బోర్డు… లోన కార్డు…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇదేనేమో మరి. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అసాంఘీక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తుండడంతో ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు కొందరు. బహిరంగంగా మద్యం సేవించినా, జూదం ఆడుతున్న వారిని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలకు పనిచెప్పారు సీపీ. దీంతో సామాన్యులు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. కానీ బడా బాబులు మాత్రం కాస్తా డిఫరెంట్ గా తమ వ్యసనాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్థిక బలం, అంగబలం ఉంటే చాలు తామేం చేసినా చెల్లుతుందన్న ధీమానో లేక ఒకరిద్దరు కాఖీ సార్ల పరిచయాలు ఉన్నాయనో తెలియదు కానీ కరీంనగర్ తో పాటు శివారు ప్రాంతాల్లోని భవనాలకు కొత్తగా బోర్డులు వెలుస్తున్నాయి. వీటి మాటున జరుగుతున్న అక్రమ దందాలు అన్నీ ఇన్నీ కావు.

ప్రశాంత వాతావరణం కోసం ఫాంహౌజ్ లను తలపించే విధంగా కొంతమంది గెస్ట్ హౌజ్ ల నిర్మాణం జరిపారు. రోజు వారి రెంట్ వసూలు చేస్తున్నామన్న భ్రమలు కల్పించిన కొంతమంది, లోపల చేస్తున్న అక్రమ కార్యకలాపాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే బాంక్విట్ హాళ్ల పేరిట కూడా కొంతమంది వ్యసనాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిల్లో జూదం, వ్యభిచారం నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ కమిషనరేట్ లో పనిచేస్తున్న ఒకరిద్దరు ఆఫీసర్లతో ఉన్న పరిచయాలను ఆసరగా చేసుకుని కొందరు ఏకంగా వ్యభిచారం కూడా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఆ అడ్డాలకు పోలీసు అధికారులు కూడా వెల్తుండడంతో వ్యసనపరుల గుండెల్లో ధైర్యం వస్తుండగా, నిర్వహకుల జేబులు నిండిపోతున్నాయని తెలుస్తోంది.

చూడడానికి ఉన్నత శ్రేణి వ్యవహారంలా కనిపిస్తున్న తీరుతో ఎవరికీ అనుమానం రాకుండా జరుపుతున్న ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందంటున్నారు నగర వాసులు. లింక్ ఉంటే చాలు నెట్ వర్క్ల్ లో జాయిన్ అయిపోవచ్చన్న కాన్ఫిడెన్స్ తో వ్యసనపరులు ముందుకు సాగుతుంటే వారి నమ్మకమే మాకు ఆదాయం అన్నట్టుగా అసాంఘీక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కొంతమంది నిర్వహకులు. హాయ్ ఫై దందా తీరు హైదరాబాద్ నగరాన్ని మరిపిస్తున్నా కమిషనరేట్ బాస్ వరకూ వెల్లకపోవడం విస్మయం కల్గిస్తోంది. కొంతమంది గ్రౌైండ్ లెవల్ ఆఫీసర్ల అటాచ్ మెంట్ కారణంగానే సీపీ వరకూ ఈ విషయాలు చేరడం లేదన్న చర్చ కూడా సాగుతోంది. సామాన్యుడు దొరికితే కేసులు, జరిమానాలు, కౌన్సిలింగ్ లు నిర్వహించే పోలీసు సార్లు ఈ అసామన్య కేంద్రాలపై చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం నగరవాసులను విస్మయానికి గురి చేస్తోంది.

Next Story