చైతు నువ్వు పెళ్లి చేసుకుంటే.. నాకు కోక రైక ఎవరిస్తారు? 

by  |
bhangarraju
X

దిశ, సినిమా: కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘బంగార్రాజు’. కాగా ‘సొగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండగా.. మేకర్స్ తాజాగా మరో సాంగ్ టీజర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ మేరకు ‘ఓయ్ బంగార్రాజు.. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బంగార్రాజు.. మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోక బ్లౌజు’ అంటూ సాగే ఈ పాట పోస్టర్‌లో తండ్రీకొడుకులు నాగ్ అండ్ చై ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లాతో కలిసి మాస్ బీట్‌కు స్టెప్పులేస్తూ కనిపించారు. ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ ఫ్రమ్ బంగార్రాజు అంటూ.. టీమ్ ఈ సాంగ్ టీజర్‌ను పంచుకోగా.. డిసెంబర్ 17న మూవీ టీజర్ రాబోతుందని ప్రకటించారు. ఇక ఈ మూవీలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, చైతూకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు.

మంగ్లీ చాలా హాట్ గురు.. వీడియోపై నెటిజన్ల కామెంట్స్



Next Story

Most Viewed