- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.100 కోసం వేట కత్తులతో నరికారు.. చివరకు!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాను రాను హ్యుమన్ వాల్యూస్ పూర్తిగా క్షీణిస్తున్నాయి. డబ్బులకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది. కాసుల కోసం పేగు బంధాలనే కాదు.. స్నేహ బంధాలను కూడా అడ్డు తొలగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రూ.100 కోసం తోటి స్నేహితులపై పలువురు రాళ్లతో దాడి చేయగా.. ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో నిందితులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు గెలాక్సీ బార్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రాను రాను హ్యుమన్ వాల్యూస్ పూర్తిగా క్షీణిస్తున్నాయి. డబ్బులకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది. కాసుల కోసం పేగు బంధాలనే కాదు.. స్నేహ బంధాలను కూడా అడ్డు తొలగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రూ.100 కోసం తోటి స్నేహితులపై పలువురు రాళ్లతో దాడి చేయగా.. ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో నిందితులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు గెలాక్సీ బార్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 22న గోపీనాథ్, వెంకటేష్ మధ్య రూ.100 విషయంలో వివాదం తలెత్తింది. గోపినాథ్ తోటి స్నేహితులపై రాళ్లతో దాడికి పాల్పడగా, ఆగ్రహించిన మిత్రులు కర్రలతో గోపీనాథ్‌ను కొట్టి చంపారు. నిందితులు వాడిన రెండు వేట కొడవళ్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు అర్భన్ ఎస్పీ తెలిపారు.
Next Story






