ఫ్రెండ్ పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్స్.. వైరలవుతోన్న పిక్స్

by  |
ఫ్రెండ్ పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్స్.. వైరలవుతోన్న పిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా పెళ్లికి ఏమేం బహుమతులు ఇస్తారు? అమ్మాయి అయితే గోల్డ్ లేదా ఇంటికి అవసరమైన ఫర్నిచర్.. అదే అబ్బాయి అయితే.. వాచ్ లేదంటే రింగ్ అదీ కాకుంటే ఇష్టమైనవి తీసుకోమంటూ డబ్బులిస్తారు. కానీ, తమిళనాడులో జరిగిన ఓ పెళ్లిలో వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చిన బహుమతులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ధరల పెరుగుదలను నిరసిస్తూ.. వధూవరులకు వారి స్నేహితులు వెల్లుల్లిపాయలు, పెట్రోల్, గ్యాస్ సిలిండర్‌ను బహుమతులుగా ఇచ్చారు.

తమిళనాడులోని పెరంబూర్ జిల్లా మధురవాయల్‌లో బుధవారం రాత్రి కార్తీక్-శరణ్యల వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన వారి స్నేహితులు 5 లీటర్ల పెట్రోల్‌, చిన్న ఉల్లితో మాలలు, వంటగ్యాస్‌ సిలిండర్‌ను బహుమతిగా అందజేశారు. వాటిని చూసిన బంధువులు ఆశ్చర్యపోయారు. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ఇటీవల ఆయిల్‌ సంస్థలు వంటగ్యాస్‌ ధరను కూడా పెంచాయి.

తాజాగా రాష్ట్ర మార్కెట్‌లో వెల్లుల్లిపాయ కిలో రూ.150కి చేరింది. ఈ ధరల పెరుగుదలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వధూవరుల స్నేహితుల ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వధూవరులకు స్నేహితులు పెట్రోల్, వెల్లుల్లి దండలు గ్యాస్ సిలిండర్‌ను బహుమతిగా ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో సందడి చేస్తున్నారు.

Next Story

Most Viewed