ఈ రాశి స్త్రీలకు గుడ్‌న్యూస్.. భర్తల నుంచి స్పెషల్ గిఫ్ట్స్

by  |
Panchangam
X

తేది : 2, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 32 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 52 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 13 ని॥ వరకు)
యోగము : శోభనము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 47 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 5 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 10 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 14 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గంటల వరకు)

మేష రాశి: మీరు మాట్లాడేటప్పుడు కంగారుపడుతున్నారు గందరగోళం వదిలేయండి. దైవప్రార్థన వలన మానసిక బలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు. కొంతమందికి ఆఫీస్ టూర్స్. ఆఫీస్ పనులలో మీ తెలివితేటలను సామర్థ్యాన్ని ఉపయోగించండి. మీరు ఆశిస్తున్న అభివృద్ధి పనులు జరగకపోవడం వలన మానసిక అశాంతి. మీరు ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతున్నా కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు గొడవ పడటం మానేయండి. మనసు విప్పి మాట్లాడుకోండి అపార్ధాలు తొలగిపోతాయి.

వృషభ రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆఫీస్ పనులలో తొందరపాటు వద్దు. సహనంతో సకాలంలో పనులు పూర్తి చేయండి. అప్పుడే మీ సామర్ధ్యంపై అందరికీ నమ్మకం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

మిధున రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. భార్య భర్తలు చిన్న విషయాలకు గొడవలు పడకండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ సామర్ధ్యం పై అందరి ప్రశంసలు వ్యాపారస్తులకు మంచి లాభాలు. కావలసినంత ధనం చేతికందుతుంది. స్థిరాస్తి పెట్టుబడులలో మంచి లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మాట ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కావలసిన పదం చేతికందుతుంది. దుబారా ఖర్చులను నివారించండి. సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కన్య రాశి: నిరాశావాదం లో నుంచి బయటికి రండి. మీ మీద మీరు నమ్మకం పెంచుకోవటానికి ప్రయత్నించండి. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ పని నిబద్ధత మీద అందరి ప్రశంసలు. కొందరు ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. అవసరాలకు కావలసిన ధనం చేతికందుతుంది దుబారా ఖర్చులు చేయకండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మర్చిపోండి ఒక ఆనందకరమైన రోజు నడపండి.

సింహరాశి: సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. బహుమానాలు అందుకుంటారు. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. ఆహ్వానంతో ఆఫీస్ పనులను పూర్తి చేయండి నిరాశావాదం నెగిటివ్ ఆలోచనలు వలన జీవితంలో ఎదగడం కష్టం. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు అవకాశాలు. కంటి జబ్బులకు అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి: నిరాశావాద ధోరణిని వదిలిపెట్టండి. మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. దైవప్రార్థన వలన మానసిక బలం. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. నిర్లక్ష్యం వలన చాలా నష్టాలు. ముఖ్యమైన నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి. ఆఫీసు పనులను సహనంతో సకాలంలో పూర్తి చేయండి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి ఒక ఆనందకరమైన రోజు నడపండి.

వృశ్చిక రాశి: మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆదాయ పరమైన ఇబ్బందులు మిమ్మల్ని గందరగోళంలోకి నెడతాయి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పట్టుదలతో పనులను పూర్తిచేయండి. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు గౌరవం పెంచుకోండి ఇంటిలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మిమ్మల్ని మంచి గిఫ్ట్ తో సంతోషపరచడానికి వస్తున్నారు. ఆనందించండి.

తులారాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. అనారోగ్యం నుంచి బయట పడతారు ఆరోగ్యం చక్కబడుతుంది. అధిక కోపం వలన ఎసిడిటి పెరుగుతుంది సరిగ్గా ఆలోచించలేరు. మీ ఇంటికి కొత్తగా పాప /బాబు రాబోతున్నారు ఆనందించండి. అనవసరపు బాతాఖానీ వలన సమయం వృధా. సమయం చాలా విలువైనది సద్వినియోగం చేసుకోండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొందరు ఉద్యోగులకు అవార్డ్స్ వస్తాయి. అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది శుభకార్యాలకు ఖర్చు పెడతారు. ఈ రాశి స్త్రీలకు నీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

మకర రాశి: నిరాశావాదులతో గడపటం వలన మీరూ నిరాశ వాదంలోకి జారిపోతారు. ఆత్మవిశ్వాసం పెంచుకోండి దానితో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబంలో పెద్దవారి సలహాలు ఉపయోగపడతాయి. అతినిద్ర అనవసరపు బాతాఖానీ ల వలన సమయం వృధా. సమయం విలువైనది సద్వినియోగం చేసుకోండి. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆఫీసు పనులలో అధిక శ్రమ. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. ప్రతీ చిన్న విషయానికి గొడవలు పడటం మానేయండి.

కుంభరాశి: దైవ ప్రార్ధన వలన మానసిక బలం దానివలన పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. మీ భార్య భర్తల సామరస్య ప్రవర్తన వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆఫీసు పనులలో అధిక శ్రమ సహనంతో పట్టుదలతో పనులను సకాలంలో పూర్తి చేయండి. ఆదాయ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మీన రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. గందరగోళం వదిలేయండి. వ్యాపారస్తులు తమ శీఘ్ర నిర్ణయాల వలన లాభాలు పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఉన్నాయి వారితో ఆనందంగా గడపండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఇంటి మరమ్మతుల కోసం ఖర్చు పెడతారు. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవటం మానేయండి. దానివలన గొడవలు తగ్గవు కదా మరింత పెరుగుతాయి.



Next Story

Most Viewed