పోలీసుశాఖ వినూత్న ప్రయోగం.. ఉచిత శిక్షణ!

83

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ పోలీసు శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు, ఉత్తీర్ణత సాధించిన వారికి పోలీసు కానిస్టేబుల్ ఎంపిక పరీక్ష కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

నవంబర్ నుంచి ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించేందుకు పోలీసు శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి కాలేజీ నుంచి కనీసం 100 మందికి ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.