నిరుద్యోగులకు ‘లైఫ్ ఫౌండేషన్’ గుడ్‌న్యూస్..

423

దిశ‌, ఖమ్మం టౌన్ : ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువ‌త‌కు వృత్తి విద్యా నైపుణ్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ జిల్లా కో – ఆర్డినేటర్ వడిగ శిల్పాసురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. హోటల్ మేనేజ్ మెంట్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

16 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు. త‌ర‌గ‌తులు రెండు నెలలపాటు ఉంటుందని, శిక్షణ పూర్తయిన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 27తేదీల్లో పదో తరగతి మెమో, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకొని ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఎదుట గల కార్యాలయానికి రావాలని కోరారు. వివరాలకు నెంబర్లు 9010525740 , 9912314547 , 8919139407 సంప్రదించాలని కోరారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..