బీ అలెర్ట్ అంటోన్న విజయ్ దేవరకొండ టీమ్

by  |
బీ అలెర్ట్ అంటోన్న విజయ్ దేవరకొండ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పి కొందరు మోసాలకు పాల్పడుతున్నారంటూ అతని టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. విజయదేవరకొండతో సినిమా చేస్తున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ నటీనటులకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది.

విజయ్ దేవరకొండ ఏదైనా సినిమాలో నటిస్తున్నట్టయితే… దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విజయ్ లేదా నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారు. సినిమాకి సంబంధించి పూర్తి నిర్ధారణ కోసం విజయ్ దేవరకొండ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేసుకోవచ్చు.

అంతేగాని తప్పుడు ప్రచారం చేసేవారి మాటలు నమ్మి మోసపోవద్దు. విజయ్ పేరు చెప్పి ఆడిషన్స్ నిర్వహిస్తున్న నేరస్థులపై మేము చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఇలాంటి మోసగాళ్ళు పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకు వచ్చే సమాచారాన్ని రెండుసార్లు తనిఖీ చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము అంటూ విజయ దేవరకొండ టీమ్ సభ్యుడు అనురాగ్ పర్వతనేని ఒక ప్రకటన విడుదల చేశారు.

Read Also…

ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు “పుష్ప” బృందం

Next Story