- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఆందోళనలో తెలంగాణ నాయకుడి కాలు ఫ్రాక్చర్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పెగాసస్ స్పైవేర్ గూఢచార్యం, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని పార్లమెంట్ ముట్టడి చేపట్టారు. పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యాలయ పరిసర ప్రాంతాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పలువురికి గాయాలు కాగా అందులో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పెగాసస్ స్పైవేర్ గూఢచార్యం, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని పార్లమెంట్ ముట్టడి చేపట్టారు. పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యాలయ పరిసర ప్రాంతాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పలువురికి గాయాలు కాగా అందులో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదని, కాలు ఫ్రాక్చర్ అవడంతో సిమెంట్ పట్టి వేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
Next Story






