ఒక్క నెలలో రూ. లక్ష కోట్ల ఎఫ్‌పీఐలు వెళ్లిపోయాయి!

by  |
ఒక్క నెలలో రూ. లక్ష కోట్ల ఎఫ్‌పీఐలు వెళ్లిపోయాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ మాంద్యాన్ని మార్కెట్ల కాళ్ల ముందు పడేస్తోంది. దేశీయంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తి దెబ్బకు విదేశీ పెట్టుబడిదారులు భారత మూలధన మార్కెట్ల నుంచి ఒక్క మార్చి నెలలోనే రూ. లక్ష కోట్లకు పైగా మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితులను అద్దంలోంచి చూపించినట్టుగా స్పష్టమైన మాంద్యాన్ని కళ్లముందు ఉంచుతోంది. కరోనా వ్యాప్తి వేగంగా విస్తరించడం వంటి పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ అనేది ప్రమాణంగా మారిందని ఈ పరిణామాలను దృష్టిలో ఎఫ్‌పీఐల విషయంలో పెట్టుబడిదారులు జాగ్రత్త వైఖరిని అనుసరించడానికి దారి తీశాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

మార్చి నెలలో 2వ తేడీ నుంచి 27వ తేదీ మధ్య కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 59,377 కోట్ల నికర మొత్తాన్ని ఈక్విటీల నునంచి, రూ. 52,811 కోట్లను రుణ విభాగాల నుంచి ఉపసంహరించుకున్నట్టు డిపాజిటరీల సమాచారం చెబుతోంది. మార్చి నెలలో మొత్తం నికర ఔట్‌ఫ్లో రూ. 1,12,188 కోట్లు. ఇది 2019 సెప్టెంబర్ నుంచి వరుస ఆరు నెలల ఎఫ్‌పీఐ పెట్టుబడుల మొత్తం. కేవలం ఒక్క నెలలోనే ఈ స్థాయి ఉపసంహరణ జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తునంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లో ఎఫ్‌పీఐ డేటా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అత్యధిక ఉపసంహరణ అని నిపుణులు చెబుతున్నారు.

‘ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా దేశీయంగా వ్యాపారాలు, వాణిజ్యం పూర్తీగా నిలిచిపోయాయి. ఇది దేశీయ ఆర్థిక వృద్ధి వేగాన్ని తగ్గిస్తుంది’ అని సీనియర్ విశ్లేషకులు, హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచమంతా పోరాటాన్ని తీవ్రతరం చేసినప్పటికీ పరిణామాలను అంచనావేయడం సాధ్యం కావడం లేదు. వ్యాధిని నిలువరించి, వనరులను కాపాడుకోవడానికి అనేక చర్యలు ప్రకటించినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించిన ఆందోళనలు సుధీర్ఘమైన తిరోగమనాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. ఈ తిరోగమనం ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు దూరంగా వెళ్లడం, ఈ పరిణామాలు వాస్తవ రూపంలోకి వచ్చే అవకాశం ఉందని శ్రీవాస్తవ వివరించారు.

Tags : Foreign Investment, stock markets, fpi, march


Next Story

Most Viewed