- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీగపై బట్టలు ఆరేస్తూ షాక్‌తో నలుగురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఆమనగల్లులో తీగపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు రెండు కుటుంబాలకు చెందిన దంపతులు సత్తయ్య- రాధమ్మ, లింగయ్య-లచ్చమ్మగా గుర్తించారు. కరెంట్ షాక్ కొట్టిన ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే నలుగురు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఆమనగల్లులో తీగపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు రెండు కుటుంబాలకు చెందిన దంపతులు సత్తయ్య- రాధమ్మ, లింగయ్య-లచ్చమ్మగా గుర్తించారు. కరెంట్ షాక్ కొట్టిన ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే నలుగురు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






