కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

7

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్ కాల్వలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై రొంపిచర్ల-సుబ్బాయాపాలెం మధ్య జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, మృతదేహాలను వెలికి తీసి, నర్సారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.