- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తూరు జిల్లాలో కుటుంబం ఆత్మహత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్సార్‌పురం మండలం చిన్నతయ్యూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో గొడవపడిన భార్య సింధుప్రియ క్షణికావేశంలో ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకింది. అయితే ఎవ్వరికీ ఈత రాకపోవడంతో ముగ్గురు బావిలోనే మునిగి చనిపోయి శవాలై తేలారు. ఈ విషయం తెలుసుకున్న భర్త సుధాకర్ మనస్థాపంతో చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. చిన్న విషయానికే గొడవ జరిగి కుటుంబం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్సార్‌పురం మండలం చిన్నతయ్యూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో గొడవపడిన భార్య సింధుప్రియ క్షణికావేశంలో ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకింది. అయితే ఎవ్వరికీ ఈత రాకపోవడంతో ముగ్గురు బావిలోనే మునిగి చనిపోయి శవాలై తేలారు. ఈ విషయం తెలుసుకున్న భర్త సుధాకర్ మనస్థాపంతో చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. చిన్న విషయానికే గొడవ జరిగి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు సూసైడ్ చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






