- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking : ముంబైలో నలుగురు కూలీలను బలిగొన్న ‘లిఫ్ట్’
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై అంతస్తు నుంచి అనుకోకుండా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన ముంబైలోని వర్లి హనుమాన్ గుల్లీ ఏరియాలో జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కన్‌స్ట్రక్షన్ కంపెనీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై అంతస్తు నుంచి అనుకోకుండా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ఘటన ముంబైలోని వర్లి హనుమాన్ గుల్లీ ఏరియాలో జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్వహణ లోపం వల్లే కూలీలు మృతి చెందినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






