సంచలన ఘటన.. జవాన్ కాల్పుల్లో సహచరులు మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-07 23:48:59  IST  )

<p>దిశ, భద్రాచలం: తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మారాయిగూడెం సమీపంలోని లింగంపల్లి బేస్‌క్యాంపులో జవాన్ల నడుమ పరస్పర కాల్పులు కలకలం రేపాయి.‌ ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్‌కి చెందిన నలుగురు జవాన్లు మృతిచెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా [&hellip;]</p>

సంచలన ఘటన.. జవాన్ కాల్పుల్లో సహచరులు మృతి
X

దిశ, భద్రాచలం: తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మారాయిగూడెం సమీపంలోని లింగంపల్లి బేస్‌క్యాంపులో జవాన్ల నడుమ పరస్పర కాల్పులు కలకలం రేపాయి.‌ ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్‌కి చెందిన నలుగురు జవాన్లు మృతిచెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. భద్రాచలం ఏఎస్‌పీ డాక్టర్ వినీత్ ఆసుపత్రికి వెళ్ళి దగ్గర ఉండి జవాన్లకు వైద్యసేవలు అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. రితిష్ రంజన్ అనే జవాన్ తోటి జవాన్లపై కాల్పులు జరిపినట్లుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మారాయిగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story