- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రుణ భారం వారి పాలిట మృత్యుపాశమైంది. అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంజిరాల రమేష్(40), భార్య పద్మ (35) కుమారుడు, అక్షయ్ (17) కుమార్తె, సౌమ్య (19) తనువు చాలించారు. అయితే రమేశ్, పద్మ దంపతులు ఓ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. అక్షయ్, సౌమ్య మృతదేహాలు మరోచోట పడి […]</p>

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రుణ భారం వారి పాలిట మృత్యుపాశమైంది. అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంజిరాల రమేష్(40), భార్య పద్మ (35) కుమారుడు, అక్షయ్ (17) కుమార్తె, సౌమ్య (19) తనువు చాలించారు. అయితే రమేశ్, పద్మ దంపతులు ఓ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. అక్షయ్, సౌమ్య మృతదేహాలు మరోచోట పడి ఉన్నాయి.
భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తే నష్టం వచ్చిందని, రూ. 7.80 లక్షల అప్పులు ఉన్నాయని రమేష్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాను ఏం చేయ్యలేకపోతున్నాని అందరూ క్షమించాలని కోరాడు. తనకు కనీసం ఎకరం భూమి ఉన్నా.. అమ్మి అప్పు తీర్చే వాడినని లేఖలో రాశాడు. పైసల్లేక నలుగురి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందన్నాడు. అందరికీ ఈనెల 20న డబ్బులు ఇస్తానని చెప్పానని.. డబ్బులు లేకపోవడంతో అడిగితే ఏం చెప్పాలో తెలియక.. చనిపోతున్నామని లేఖ రాశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






