న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కిన రైతులు

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిల్లర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో పలువురు రైతులు సెల్ టవర్ ఎక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ సమయంలోనే మరి కొంతమంది టవర్ ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల మేరకు కోత విధిస్తున్నారని, తాలు తీసిన వడ్లకు కోత పెట్టడం ఏమిటని [&hellip;]</p>

న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కిన రైతులు
X

దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిల్లర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో పలువురు రైతులు సెల్ టవర్ ఎక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ సమయంలోనే మరి కొంతమంది టవర్ ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల మేరకు కోత విధిస్తున్నారని, తాలు తీసిన వడ్లకు కోత పెట్టడం ఏమిటని వాపోయారు. ఇకమీదట ఎలాంటి కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. పోలీసులు, అధికారులు టవర్ ఎక్కిన వారిని సముదాయించే ప్రయత్నం చేయగా, తమకు జరుగుతున్న అన్యాయాన్ని నివారిస్తేనే కిందకు దిగుతామని పట్టుబట్టారు. విషయం ఉన్నతాధికారులకు చేరవేయడంతో జిల్లా పౌరసరఫరాల అధికారి హామీ మేరకు రైతులు కిందకు దిగారు.

tags: farmers and congress leaders boarding on tower, millers create problems, purchase rice

Next Story