- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేలానికి ఒబామా షూస్.. ధర తెలిస్తే షాక్!
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. అగ్రరాజ్యాన్ని వరుసగా రెండు పర్యాయాలు పాలించిన నల్లజాతీయుడిగా చరిత్రలో నిలిచాడు. అమెరికా అధ్యక్షుడిగానే కాకుండా, ఆయన వ్యక్తిత్వానికి కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన మానవతా దృక్పథాన్ని చాటుకుని, ప్రపంచ కీర్తి సాధించారు. అంతేగాకుండా క్రీడకల్లోనూ అద్భుతంగా రాణించిన ఒబామా.. 1989లో ఫుట్‌బాల్ కప్పు సాధించారు. కేవలం ఫుట్ బాల్ మాత్రమే కాకుండా ఆయనకు ఇతర ఆటలపై కూడా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. అగ్రరాజ్యాన్ని వరుసగా రెండు పర్యాయాలు పాలించిన నల్లజాతీయుడిగా చరిత్రలో నిలిచాడు. అమెరికా అధ్యక్షుడిగానే కాకుండా, ఆయన వ్యక్తిత్వానికి కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన మానవతా దృక్పథాన్ని చాటుకుని, ప్రపంచ కీర్తి సాధించారు. అంతేగాకుండా క్రీడకల్లోనూ అద్భుతంగా రాణించిన ఒబామా.. 1989లో ఫుట్‌బాల్ కప్పు సాధించారు. కేవలం ఫుట్ బాల్ మాత్రమే కాకుండా ఆయనకు ఇతర ఆటలపై కూడా ఎంతో ఆసక్తి ఉండేది. ముఖ్యంగా బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం. దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా నైక్(Nike) సంస్థ ద్వారా షూస్‌ను తయారు చేసి, 2009లో అందజేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఎక్కువగా ఈ షూస్‌నే ధరించినట్టు సమాచారం.
ప్రపంచ దేశాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఓబామా, అందరూ అతన్ని ప్రత్యేకంగా పరిశీలించేలా చేసుకున్నాడు. అంతేకాడు, ఆయన వాడిన వస్తువులకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, బరాక్ ఒబామా వాడిన షూస్ విషయం తెరపైకి వచ్చింది. దీంతో ఆయన షూస్‌ను వేలం వేశారు. ఆయనకు ఎంతో ఇష్టంగా బహూకరించిన నైక్(Nike) సంస్థ ఆయన షూస్‌ను వేలానికి పెట్టింది. అంతేగాకుండా దీని ప్రారంభ అందరినీ నోరెల్లబెట్టేలా, 25వేల డాలర్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో రూ.18,21,575. ఈ షూలపై ఒబామా సంతకం కూడా ఉండటంతో ధర అంతమొత్తంలో నిర్ణయించినట్టు సమాచారం. ఈ షూస్ అంటే ఒబామాకు చాలా ఇష్టమని ఒబామాతో సన్నిహితంగా మెలిగిన మిత్రులు వెల్లడించారు.
Nike sneakers custom-designed for @BarackObama will go on sale on Sotheby's for $25,000: https://t.co/adm1o8XEbG pic.twitter.com/2U4pSJQEy4
— ForbesLife (@ForbesLife) February 11, 2021






