బీజేపీ కీలక నేతకు కరోనా పాజిటివ్

10

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఎంత కట్టడి చేసినా… ఏమాత్రం తగ్గకుండా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే అనేక మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీక కీలక నేత ఎన్వీఎస్ ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అంతేగాకుండా ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.