- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారూ మమ్మల్ని ఆదుకోండంటూ..రైతు ఆత్మహత్యాయత్నం
<p>దిశ, కరీంనగర్: సార్ నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోండంటూ అని ఓ మధ్య తరగతికి చెందిన రైతు మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని ఓ సెల్ఫీ వీడియో ద్వారా కోరాడు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మిల్లర్ల వద్దకు తీసుకుని పోతే, వడ్లు పాడైనాయని కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ రైతుల బాధ ఎవరికీ రావొద్దని..నేనీలోకం నుంచి వెళ్లిపోతున్నానని వీడియోలో పేర్కొన్నాడు. నా పరిస్థితి మిగతా రైతులకు రాకుండా […]</p>

దిశ, కరీంనగర్: సార్ నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోండంటూ అని ఓ మధ్య తరగతికి చెందిన రైతు మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని ఓ సెల్ఫీ వీడియో ద్వారా కోరాడు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మిల్లర్ల వద్దకు తీసుకుని పోతే, వడ్లు పాడైనాయని కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ రైతుల బాధ ఎవరికీ రావొద్దని..నేనీలోకం నుంచి వెళ్లిపోతున్నానని వీడియోలో పేర్కొన్నాడు. నా పరిస్థితి మిగతా రైతులకు రాకుండా చూడాలని మంత్రికి విన్నవించాడు. మూడు రోజులవుతోంది లారీలో ఉన్న వడ్లు వర్షానికి తడిచినయ్..ఎంతో కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని ఎన్నిమార్లు బతిమిలాడినా..మిల్లర్లు మాకవసరం లేదు, మిల్లులు నిండినయ్ అంటున్నారని వివరించాడు.వివరాల్లోకి వెళితే..సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన గుడి మహిపాల్ రెడ్డి ధాన్యం కొనడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఎల్లారెడ్డిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత రైతు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ధాన్యం సేకరణలో చివరి నిర్ణయం మిల్లర్లదే కావడంతో ఈ దుస్థితి వచ్చిందన్నారు. దీనివల్లే చాలా చోట్ల రైతులు తమ ధాన్యాన్ని దగ్దం చేయడం, ధర్నాలు చేయడం వంటి నిరసనలు జరిగాయన్నారు.అయినప్పటికీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని వివరించాడు. పంట అమ్ముకుని చేతికొచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చుకుని, మరోసారి పంట వేసేందుకు సమాయత్తం కావల్సిన ఈ సమయంలో కూడా రైతులు ధాన్యం కొనండి మొర్రో అంటూ అడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. చివరకు ఓ రైతు బలవణ్మరనానికి పాల్పడుతున్నారంటే రైతులు ఎలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నారో ప్రభుత్వాలు, నాయకులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.






