ప్రజలరా దొరగారిని సక్కగా చూసుకోండ్రి : విజయశాంతి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-27 11:37:42  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు (శనివారం) ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయశాంతి ట్విట్టర్ ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రజలకు సవినయ మనవి.. రేపటి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార బహిరంగ సభ నుంచి మన [&hellip;]</p>

ప్రజలరా దొరగారిని సక్కగా చూసుకోండ్రి : విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు (శనివారం) ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసగిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా విజయశాంతి ట్విట్టర్ ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రజలకు సవినయ మనవి.. రేపటి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార బహిరంగ సభ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దొరగారిని ఒక్కసారి చూసుకోండ్రి. మల్లా ఇంక ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది, వినబడేది అసాధ్యం. ప్రజలు ఇప్పుడున్న కష్టాలకు సీఎం గారి కామెడీ వాగ్దానాల ద్వారా ఏదో కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉండవచ్చు. హామీల అమలు ఎప్పటిలాగే ఏమీ ఉండదని మనందరికీ ఎప్పుడూ తెలిసిన కార్యక్రమమే’’.. అంటూ తనదైన శైలితో విమర్శలు గుప్పించారు.

Next Story