టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు అయిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి శుక్రవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి సోదరుడు. ఈ సందర్భంగా చంద్రబాబు.. భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు. జమ్మలమడుగు టీడీపీకి కంచుకోటని తెలిపారు. జమ్మలమడుగులో పార్టీకోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని [&hellip;]</p>

telugu desam party
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు అయిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి శుక్రవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి సోదరుడు. ఈ సందర్భంగా చంద్రబాబు.. భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు. జమ్మలమడుగు టీడీపీకి కంచుకోటని తెలిపారు. జమ్మలమడుగులో పార్టీకోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌రెడ్డి అన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేడ్కర్‌ రాజ్యాంగం రాశారన్నారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

Next Story