- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు గూడూరు నారాయణరెడ్డి గుడ్ బై?
<p>దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మెంబర్ గూడూరు నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ఆయనతో బీజేపీ నేతలు ఇప్పటికే టచ్ లో ఉన్నట్లు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మెంబర్ గూడూరు నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ఆయనతో బీజేపీ నేతలు ఇప్పటికే టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో నారాయణరెడ్డి పార్టీని వీడకుండా ఉండేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన్ను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూకుడు పెంచగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో వెనుకబడింది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలకు బీజేపీ గాలెం వేస్తుండటంతో వారిని కాపాడుకోలేక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.






