‘పోరాటానికి కుల ముద్ర వేసే ప్రయత్నం’

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరులో అమరావతి రైతులు మద్దతుగా టీడీపీ నేతలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ&#8230; జగన్ స్వార్థ రాజకీయాల కోసం రాజధానిని తరలిస్తున్నారని విమర్శించారు. రాజధాని పోరాటానికి కుల ముద్ర వేసి అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ&#8230; ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జగన్ [&hellip;]</p>

‘పోరాటానికి కుల ముద్ర వేసే ప్రయత్నం’
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరులో అమరావతి రైతులు మద్దతుగా టీడీపీ నేతలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ… జగన్ స్వార్థ రాజకీయాల కోసం రాజధానిని తరలిస్తున్నారని విమర్శించారు. రాజధాని పోరాటానికి కుల ముద్ర వేసి అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జగన్ అధికారలంలో ఉన్నంతకాలం ఈ కష్టాలు తప్పవన్నారు.

Next Story