- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుపాకీతో మాజీ మంత్రి హల్‌చల్
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి హల్‌చల్ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల మండలం పిల్లాయిపల్లి కాలువ పనులను అడ్డుకున్న గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో బెదిరించారు. సర్వే ప్రకారమే పనులు చేస్తుండగా అడ్డుకున్న మాజీ మంత్రి… తన భూమిలో నుంచి కాలువ తీయొద్దంటూ ఇంజినీర్, జేసీబీ ఆపరేటర్‌తో గొడవకు దిగారు. పనులు నిలిపి వేయాలని తుపాకీతో బెదిరించడంతో అక్కడున్న వారంత భయానికి గురయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత ఇంజినీర్ ఫిర్యాదుతో, జిల్లా […]</p>

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి హల్‌చల్ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల మండలం పిల్లాయిపల్లి కాలువ పనులను అడ్డుకున్న గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో బెదిరించారు. సర్వే ప్రకారమే పనులు చేస్తుండగా అడ్డుకున్న మాజీ మంత్రి… తన భూమిలో నుంచి కాలువ తీయొద్దంటూ ఇంజినీర్, జేసీబీ ఆపరేటర్‌తో గొడవకు దిగారు. పనులు నిలిపి వేయాలని తుపాకీతో బెదిరించడంతో అక్కడున్న వారంత భయానికి గురయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత ఇంజినీర్ ఫిర్యాదుతో, జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆదేశాలతో… ఆయుధ చట్టం, ఇతర సెక్షన్ల కింద చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని, మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే.. 1978, 1983 రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన మోహన్ రెడ్డి నాదెండ్ల భాస్కర్‌రావు హయాంలో నెలరోజుల పాటు మంత్రిగా పనిచేశారు.






