మేం భయపడ్డట్టే జరిగింది.. మాజీ మంత్రి ఈటల

by  |
Etela-Rajendhar1
X

దిశ, హుజూరాబాద్: దళితబంధు ఎగ్గొట్టడానికి కేసీఆర్ మరో కొత్త నాటకం మొదలు పెట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇలాంటి విద్యలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి జిమ్మిక్కులు చేశారన్నారు. మొదటినుండి చెప్తున్నానని కేసీఆర్ కు దళితబంధు ఇచ్చే ఆలోచనలేదని, మేం భయపడ్డట్టే జరిగిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు నిజంగానే దళితుల మీద ప్రేమ ఉంటే ఇప్పటివరకే అందరికీ రూ. 10 లక్షలు ఇవ్వాలి కదా.. మరీ, హుజూరాబాద్ లో మీటింగ్ పెట్టి 60 రోజులు అవుతోంది.. ఎందుకు వాళ్లకు దళిత బంధు ఇవ్వలేదో చెప్పాలన్నారు. దళితబంధు ఆపించడంతో కేసీఆర్ నిజస్వరూపం మరోసారి బయటపడిందన్నారు. తెలంగాణా దళితులు, మేధావులు ఆలోచించి ఈ దళిత ద్రోహికి బుద్ధి చెప్పాలని ఈటల పిలుపు ఇచ్చారు.


Next Story