Etela Rajender : హుజురాబాద్‌కు ఈటల.. వారం పాటు ఇక్కడే మకాం!

by Sridhar Babu |   (  Updated:2021-05-27 11:03:18  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల్లో సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. శామీర్‌పేట్ నుండి హుజురాబాద్‌కు చేరుకుని వారం రోజుల పాటు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.నియోజకవర్గంలోని తన సన్నిహితులు, అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఇటీవల ఈటల బీజేపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ ఆయన పార్టీ మారితే తన శాసనసభ సభ్వత్వానికి రాజీనామా చేస్తారని, [&hellip;]</p>

Etela Rajender : హుజురాబాద్‌కు ఈటల.. వారం పాటు ఇక్కడే మకాం!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల్లో సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. శామీర్‌పేట్ నుండి హుజురాబాద్‌కు చేరుకుని వారం రోజుల పాటు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.నియోజకవర్గంలోని తన సన్నిహితులు, అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా, ఇటీవల ఈటల బీజేపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ ఆయన పార్టీ మారితే తన శాసనసభ సభ్వత్వానికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత హుజురాబాద్‌లో జరిగే ఉపఎన్నికకు సంబంధించి తన అనుచరులు, సన్నిహితులు, శ్రేయోభిలాశులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Next Story