AP News : YSRCP కి మాజీమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్: Pawan Kalyan ను అవమానిస్తున్నారు.. మీ సంగతి తేలుస్తాం

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-09-29 04:48:52  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ హోంమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ కేబినెట్‌లోని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు పవన్ కల్యాణ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనుక ముఖ్యమంత్రి [&hellip;]</p>

AP News : YSRCP కి మాజీమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్:  Pawan Kalyan ను అవమానిస్తున్నారు.. మీ సంగతి తేలుస్తాం
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ హోంమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ కేబినెట్‌లోని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు పవన్ కల్యాణ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తం ఉందని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను అవమానపర్చడం అంటే కాపు సమాజాన్ని అవమానపర్చడమేనని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు. ఇలాంటి నీచ చర్యల పర్యవసానం ఏంటో 2024లో ఎన్నికల్లో ముఖ్యమంత్రి చవి చూడాల్సి వస్తోందని చేగొండి హరిరామ జోగయ్య హెచ్చరించారు.

Next Story