- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా జీవితం వారికే అంకితం- ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
<p>దిశ, కామారెడ్డి: తాను ఇతర పార్టీలలో చేరుతున్నట్టు గందరగోళం సృష్టిస్తున్నారని మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ పెట్టుకున్న తర్వాత మంగళవారం ఉదయం ఆదిలాబాద్ లో ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్తూ కామారెడ్డి టెక్రియాల్ బైపాస్ వద్ద గల సామాన్య ప్యాలెస్ దగ్గర కాసేపు ఆగారు. ఈ సందర్బంగా స్వేరోస్, అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు […]</p>

దిశ, కామారెడ్డి: తాను ఇతర పార్టీలలో చేరుతున్నట్టు గందరగోళం సృష్టిస్తున్నారని మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ పెట్టుకున్న తర్వాత మంగళవారం ఉదయం ఆదిలాబాద్ లో ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్తూ కామారెడ్డి టెక్రియాల్ బైపాస్ వద్ద గల సామాన్య ప్యాలెస్ దగ్గర కాసేపు ఆగారు. ఈ సందర్బంగా స్వేరోస్, అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. “తాను బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు తన జీవితాన్ని అంకితం చేస్తానని, కొంత మంది కావాలనే వేరే పార్టీలో చేరుతున్నట్లు గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. తన జీవితం మొత్తం సామాజిక మహనీయులు పూలే, అంబేద్కర్, కాన్షిరాం ఆలోచన విధానాలకే అంకితం చేస్తానని చెప్పారు. ఎవ్వరు కూడా అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్, అంబెడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పాత రాము, స్వామి, రాజు, బాలప్రసాద్ బట్ట రాజు, రాంచక్రవర్తి, వెంకటేష్, పాత రాజు, బాబు, నర్సింలు, ప్రభాకర్, బిక్కనూర్ మండల స్వేరోస్ పాల్గొన్నారు.






