తెలంగాణ ప్రభుత్వ తీరు సరిగా లేదు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసంతృప్తి

by Shyam |   (  Updated:2021-08-27 09:23:31  IST  )

<p>దిశ, ఘట్కేసర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డీనేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఘట్కేసర్‌ పట్టణంలో తెలంగాణ కార్మికుల సమాఖ్య(టీకేఎస్) 14వ రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. నాటి స్వర్ణాంద్రే.. నేటి బంగారు తెలంగాణాగా నినాదం మారింది కానీ, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొందరి బతుకులే బాగుపడ్డాయని, కార్మికుల జీవితాలు దారుణంగా మారాయన్నారు. రాష్ట్రంలో సంఘటిత, [&hellip;]</p>

RS ​​Praveen Kumar
X

దిశ, ఘట్కేసర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డీనేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఘట్కేసర్‌ పట్టణంలో తెలంగాణ కార్మికుల సమాఖ్య(టీకేఎస్) 14వ రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. నాటి స్వర్ణాంద్రే.. నేటి బంగారు తెలంగాణాగా నినాదం మారింది కానీ, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొందరి బతుకులే బాగుపడ్డాయని, కార్మికుల జీవితాలు దారుణంగా మారాయన్నారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీవన విధానం దుర్భరంగా మారిందని తెలిపారు. ఎన్నికలు అనగానే వస్తేనే పాలకులకు బడుగు, బలహీన వర్గాలు గుర్తొస్తాయని, మిగతా సమయాల్లో ఎవరూ పట్టించుకున్న పాపాన పోరు అని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరు సరిగాలేదన్నారు. ప్రత్యామ్నాయం వస్తోందని హెచ్చరించారు. ఈ సభలో సంఘం నాయకులు కలకోటి రామన్న, డి.శ్యామ్ సుందర్, బి.యాదగిరి, భవాని, సాయన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story