కేతిరి సాయిరెడ్డి హఠాన్మరణం

by  |
కేతిరి సాయిరెడ్డి హఠాన్మరణం
X

దిశ, హుజురాబాద్: ఉమ్మడి జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి శుక్రవారం తెల్లవారు జామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హుజురాబాద్ మండలం జూపాకకు చెందిన సాయిరెడ్డి 1945 జనవరి 14న జన్మించారు. వరంగల్ కలెక్టరేట్ లో యూడీసీగా, ఏజీ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజీలో ఎల్ ఎల్ బి పూర్తి చేశారు. కొంతకాలం రిజర్వు బ్యాంకులో ఉద్యోగం చేశారు. తరువాత హజురాబాద్ లో అడ్వకేట్ గా ప్రాక్టిస్ ప్రారంబించి 1969లో తెలంగాణ ప్రజా సమితిలో చేరి స్వరాష్ట్ర సాధనకోసం ఉద్యమించి ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారు.

1972లో జూపాక సర్పంచ్ గా ఎన్నికైన సాయిరెడ్డి, 1974, 1981లో హుజురాబాద్ సమితి అధ్యక్షునిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, 1989లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా హుజురాబాద్ నుండి గెలిచారు. ఆ తరువాత కమలాపూర్, హుజురాబాద్ ల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సాయిరెడ్డి 2018లో హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. జడ్పీ ఛైర్మన్ గా పనిచేసినప్పుడు హుజురాబాద్ ప్రాంతంలో నిరుద్యోగు యువతకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించారు. హుజురాబాద్ ప్రాంతంలో ప్రతీ ఒక్కరిని పేరుపెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉన్న సాయిరెడ్డి హఠన్మారణం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది.



Next Story