- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు న్యాయం చేస్తేనే పీవీకి అసలైన నివాళి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ మరో వైపు పేద దళితుల భూములు గుంజుకొని వారిని చంపేస్తున్నారని మాజీ ఎంపీ వీహెచ్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీవీ ముఖ్యమంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా దేశంలో పేదలకు భూ సంస్కరణలు అమలు చేసి భూములు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పీవీకి శత జయంతి ఉత్సవాలు అని ప్రపంచంలో అందరిని […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ మరో వైపు పేద దళితుల భూములు గుంజుకొని వారిని చంపేస్తున్నారని మాజీ ఎంపీ వీహెచ్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీవీ ముఖ్యమంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా దేశంలో పేదలకు భూ సంస్కరణలు అమలు చేసి భూములు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పీవీకి శత జయంతి ఉత్సవాలు అని ప్రపంచంలో అందరిని పిలుస్తున్న సీఎం కేసీఆర్ తన నియోజకవర్గంలో బ్యాగరు నర్సింహులు 13గుంటల భూమి గుంజుకున్నారని మండిపడ్డారు. తాను నర్సింహులు కుటుంబాన్ని పరామర్శించి రూ. 10వేల ఆర్థిక సహాయం చేశానని, వారివద్ద 13గుంటల భూమి తాలూకు పట్టా కూడా ఉందని వివరించారు. పేదలకు న్యాయం చేసినపుడు పీవీకి అసలైన నివాళి అని వీహెచ్ అన్నారు.
Next Story






