- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషమంగా లాలూ ప్రసాద్ ఆరోగ్యం
<p>దిశ, వెబ్‌డెస్క్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గతకొన్ని రోజుల క్రితం అనారోగ్యం బారినపడ్డ ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్ చికిత్స పొందుతున్నారు. ఆయన కిడ్నీలు 25శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించొచ్చని వైద్యులు చెబుతున్నారు. లాలూ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు తెలిసింది. అయితే లాలూ 20 ఏళ్లుగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గతకొన్ని రోజుల క్రితం అనారోగ్యం బారినపడ్డ ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్ చికిత్స పొందుతున్నారు. ఆయన కిడ్నీలు 25శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించొచ్చని వైద్యులు చెబుతున్నారు. లాలూ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు తెలిసింది. అయితే లాలూ 20 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, అందువల్ల కిడ్నీ పనితీరు క్రమంగా క్షీణించిందని వైద్యుడు ప్రసాద్ వెల్లడించారు. ఈ పరిస్థితిలో ఎలాంటి మందులు వాడినా కిడ్నీ పనితీరును 25 నుంచి 100 శాతానికి పెంచబోవని చెప్పారు. దీంతో ఆర్జేడీ నేతల్లో ఆందోళన నెలకొంది.
Next Story






