జీతం ఇవ్వకుండా డ్యూటీ నుంచి తీసేశారు.. ఫారెస్ట్ ఉద్యోగి సూసైడ్ అటెంప్ట్

by Batti.Sumithra |

<p>దిశ, కామారెడ్డి: తనకు జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ అటవీశాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగి జిల్లా శాఖ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2020 డిసెంబర్ నుంచి ఎల్లారెడ్డి అటవీశాఖ బేస్ క్యాంపులో వాచర్‌గా పని చేస్తున్నాడు. అయితే గత మార్చి 10 వ తేదీన రవీందర్ [&hellip;]</p>

జీతం ఇవ్వకుండా డ్యూటీ నుంచి తీసేశారు.. ఫారెస్ట్ ఉద్యోగి సూసైడ్ అటెంప్ట్
X

దిశ, కామారెడ్డి: తనకు జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ అటవీశాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగి జిల్లా శాఖ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2020 డిసెంబర్ నుంచి ఎల్లారెడ్డి అటవీశాఖ బేస్ క్యాంపులో వాచర్‌గా పని చేస్తున్నాడు. అయితే గత మార్చి 10 వ తేదీన రవీందర్ చెల్లెలి పెళ్లి ఉండటంతో ఉన్నతాధికారుల అనుమతి మేరకు 10 రోజులు సెలవుపై వెళ్ళాడు. మళ్ళీ మార్చి 12 నుంచి విధులకు హాజరయ్యాడు. అప్పటి నుంచి ఎఫ్డీఓ శ్రీనివాస్ తనను సొంత పనులకు వాడుకున్నాడని రవీందర్ తెలిపారు. ఎఫ్డీఓ ఏ పని చెప్పినా ఓపికగా చేశానని, అయినా తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఆగస్ట్ 15 వ తేదీన మటన్ తేవాలని ఒత్తిడి చేశాడని, ఎక్కడ దొరకలేదని చెప్తే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడాడని వాపోయాడు. అటవీశాఖకు సంబంధించిన రూ. లక్ష 20 వేల రూపాయలు కార్యాలయ అవసరాలకు వాడుకోకుండా సొంతంగా వాడుకోవడానికి ఆ డబ్బులను తన ఖాతాలో వేసుకోవాలని ఎఫ్డీఓ చెప్పగా అందుకు తాను నిరాకరించానని, దాంతో తనపై కక్ష గట్టారని రవీందర్ పేర్కొన్నాడు. ఆ డబ్బులు మళ్ళీ ఇతర ఉద్యోగి ఖాతాలో జమ చేసి వాడుకున్నాడని ఆరోపించారు. ప్రతి విషయంలో ఎఫ్డీఓ అక్రమాలకు పాల్పడుతున్నాడని రవీందర్ ఆరోపించారు.

గతంలో డీఎఫ్ఓగా ఉన్న వసంతకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఎఫ్డీఓను మందలించారని అప్పటినుంచి తనపై మరింత ఆగ్రహంగా ఉన్నారన్నాడు. ఎలాగైనా తనను తప్పించాలని భావించిన ఎఫ్డీఓ శ్రీనివాస్ తన చెల్లి పెళ్లికి సెలవుపై వెళ్లిన సమయంలో విధులకు హాజరు కాలేదన్న కారణంతో గత ఫిబ్రవరి నుంచి ఆరు నెలల జీతం పెండింగులో ఉంచారని చెప్పుకొచ్చాడు. తనకు జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎఫ్డీఓ శ్రీనివాస్, ఎఫ్.ఆర్.ఓ విద్యాసాగర్ ఇద్దరు తోడు దొంగలని రవీందర్ ఆరోపిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యాత్నించినట్టు చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రవీందర్ కోరారు.

Next Story