ఎఫ్‌సీ‌ఆర్‌ఐకి జాతీయస్థాయి గుర్తింపు

by  |
ఎఫ్‌సీ‌ఆర్‌ఐకి జాతీయస్థాయి గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ(ఎఫ్ సీ ఆర్ ఐ)కు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. కొత్తగా క్యాంపస్ ఏర్పాటైన ఏడాది కాలంలోనే ఎన్నో ప్రత్యేకతలతో జాతీయస్థాయి గుర్తింపు పొందింది ఈ కళాశాల. కాగా ఇటీవల మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ గ్రీన్ చాంపియన్’ అవార్డును సొంతం చేసుకుంది. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు ఒక్కో జిల్లా నుంచి పరిశుభ్రత, పచ్చదనం పెంపుపై శ్రద్ధ వహిస్తున్న సంస్థలను అధికారులు గుర్తించారు.

స్వచ్ఛత, పరిశుభ్రతలో ఈ కళాశాల గణనీయమైన అభివృద్ధి సాధించడంతో ఎఫ్ సీ ఆర్ఐకి ఈ అవార్డు దక్కింది. ఇందుకోసం కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులతో పాటు సీఎం కేసీఆర్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని కళాశాల డీన్ ప్రియాంక వర్గీస్ అన్నారు. ఈ అవార్డు దక్కడంపై కళాశాల డీన్, సిబ్బంది, విద్యార్థులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ అభినందించారు.


Next Story