- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాయాల బాధ భరించలేక ఫారెస్ట్ బీట్ అధికారి ఆత్మహత్య
<p>దిశ,మణుగూరు: గాయాల బాధ భరించలేక ఫారెస్ట్ బీట్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో చోటుచేసుకుంది. సారపాక కు చెందిన కిషన్,విజయలక్మి దంపతుల కుమార్తె అశ్విని అటవీశాఖలో బీట్ అధికారిగా విధులు నిర్వహిస్తుంది. అయితే కొద్దిరోజుల క్రితం ఏటూరునాగారం వద్ద జరిగిన ఓ వాహన ప్రమాదంలో అశ్విని తీవ్ర గాయాలపాలైంది. దీంతో ఆమె విధులకు సెలవు తీసుకొని ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. […]</p>

X
దిశ,మణుగూరు: గాయాల బాధ భరించలేక ఫారెస్ట్ బీట్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో చోటుచేసుకుంది. సారపాక కు చెందిన కిషన్,విజయలక్మి దంపతుల కుమార్తె అశ్విని అటవీశాఖలో బీట్ అధికారిగా విధులు నిర్వహిస్తుంది. అయితే కొద్దిరోజుల క్రితం ఏటూరునాగారం వద్ద జరిగిన ఓ వాహన ప్రమాదంలో అశ్విని తీవ్ర గాయాలపాలైంది. దీంతో ఆమె విధులకు సెలవు తీసుకొని ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గాయాల భాధ భరించలేకే అశ్విని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు బూర్గంపాడు పోలీసులు తెలిపారు.
Next Story






